MBNR: పాత పాలమూరు ప్రాంతంలో దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అండర్ డ్రైన్ సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రాములు డిమాండ్ చేశారు. సరైన డ్రైనేజీ లేక వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయాలని, లేకపోతే ఆందోళనలు పెరుగుతాయని తెలిపారు.