రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించిందన్న ఆ దేశ ఆరోపణలను అమెరికా కొట్టిపారేసింది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా నిఘా వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ మేరకు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆసక్తికర కథనం ప్రచురించింది. దీంతో ఉక్రెయిన్ పై రష్యా చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది.