సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేసిన ఆస్కార్ విజేత AR రెహమాన్ నటుడిగా మారనున్నారు. కొరియోగ్రాఫర్, దర్శకనటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న కామెడీ మూవీ ‘మూన్‌వాక్’లో రెహమాన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పేరుతూనే ఉన్న ఓ మూవీ డైరెక్టర్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి మనోజ్ నిర్మల శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్నారు.