కడప: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని నాగిశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం లభించింది. గ్రామస్తుల విజ్ఞప్తితో సర్పంచ్ వాకమళ్ళ అనంతరెడ్డి, పంచాయతీ సెక్రటరీ సిద్ధార్థ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కంప చెట్ల తొలగింపు చేపట్టారు. గొల్లపల్లె స్మశానానికి వెళ్లే దారి వెంట పెరిగిన ముళ్ల చెట్లను కూడా తొలగించారు.