NRPT: మద్దూరు మండలం ధమగన్ పూర్లో గురువారం సర్పంచ్ బోయిని నవిత భీములు ఆధ్వర్యంలో పశు వైద్య అధికారులు గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. పశుపోషకులు తప్పనిసరిగా ఈ మందును వాడాలని, దీని ద్వారా నట్టలను నివారించవచ్చని అధికారులు సూచించారు. మూగజీవాల రోగాలను ముందస్తుగా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మందులను పంపిణీ చేస్తోందని తెలిపారు.