SRPT: ఎస్సై సురేష్ రెడ్డిని సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ నేతలు స్పష్టం చేశారు. కర్ల రాజేష్ మృతికి న్యాయం కోరుతూ.. జరుగుతున్న దీక్షలు 10వ రోజుకు చేరినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో, మోతే మండల కేంద్రంలో నిరసన కేంద్రాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.