KMR: కారు అదుపుతప్పి బండను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన KMR జిల్లా కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. రామారెడ్డిలోనీ రెడ్డిపేట గ్రామానికి చెందిన గోపు నరేష్(30)KMR పట్టణంలో నివాసం ఉంటున్నాడు. నరేష్‌కు ఏడాదిన్నర క్రితమే ప్రస్తుత భిక్కనూరు సర్పంచ్ కూతురితో వివాహం జరిగింది. ప్రమాదానికి స్టీరింగ్ పనిచేయకపోవడమే కారణo అనుమానిస్తున్నారు.