ADB: నార్నూర్ మండలంలోని సోనాపూర్ గ్రామానికి చెందిన రాజ్ పిటే విక్కీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల రాజస్థాన్, అమరావతిలో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. మంచి పిచ్చర్(బాల్ వేయడం)గా పేరు సాధించాడు. ఈయన రాష్ట్రస్థాయి పోటీలో కూడా పాల్గొని ఒక బంగారు, రెండు వెండి పథకాలను దక్కించుకున్నాడు.