MHBD: బయ్యారం మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇవాళ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గుగులోత్ శాంతి, ఉప సర్పంచ్ ఉమా ఆధ్వర్యంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ శాంతి మాట్లాడుతూ.. ఓటు వేసిన ప్రజలు, శ్రమించిన పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.