TG: హైదరాబాద్ ప్రజలకు సీపీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదాలు లేని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారని అన్నారు. న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెరగడం వల్లే ఈ విజయం సాధించమని వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.