స్విట్జర్లాండ్లోని ప్రముఖ స్కీ రిసార్ట్ క్రాన్స్-మొంటానాలో న్యూ ఇయర్ వేడుకలు విషాదం చోటుచేసుకుంది. ‘లీ కానిస్టెలేషన్’ అనే బార్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.