జనాభా సంక్షోభంతో సతమతమవుతున్న చైనా, జననాల రేటును పెంచేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదిలో కండోమ్స్, ఇతర గర్భ నిరోధక సాధనాలు, ఔషధాలపై ఏకంగా 13 శాతం పన్ను విధించింది. ఈ కొత్త పన్ను విధానం జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. జనాభా తగ్గుదలను అరికట్టి, పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించేందుకే డ్రాగన్ దేశ ఈ చర్య తీసుకుంది.