కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని 2026వ సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.