BHPL: నిజాంపల్లి గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ సునీత-రవీందర్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, సంపదలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని కోరారు