WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి సీతక్క హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని కోరారు. ప్రజల ఆశయాలు నెరవేర్చేలా సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు, కార్మికులు, మహిళలు, యువత జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.