మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి 10 మంది మరణించగా, దాదాపు 150 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఒక టాయిలెట్ కింద ఉన్న ప్రధాన వాటర్ లైన్ లీక్ అవ్వడమే ఈ ఘోరానికి కారణమని అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులుగా ఒక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి, మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.