W.G: పెనుమంట్ర తహశీల్దార్ ఆఫీస్ వద్ద గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఏలియమ్మను వీఆర్వోలు, రేషన్ డీలర్లు, ఇతర రెవెన్యూ, సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్వో అశోక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.