కోనసీమ: ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటులు సంతోష్ శోభన్ వారి కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.