NZB: బోధన్ డివిజన్ ప్రజలకు సబ్ కలెక్టర్ వికాస్ మహతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం అందరికీ శాంతి, సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన చిట్ట చివరి కుటుంబం వరకు చేరేలా అన్ని శాఖల అధికారుల సమష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు.