BDK: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోలేబోయిన శ్రీవాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని పలు అంశాలపై ఎమ్మెల్యేతో ఆమె చర్చించారు. వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.