SRCL: నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటూ వందలాది మంది భక్తులు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.