TG: నూతన సంవత్సర వేడుకల్లో బిర్యానీ తిని ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్లో జరిగింది. మద్యం తాగి.. బిర్యానీ తిన్న 16 మంది అస్వస్థతకు గురి కాగా.. పాండు(53) అనే వ్యక్తి మృతి చెందాడు. వారిలో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.