వాముతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అసిడిటీతో బాధపడేవారు వాము, జీలకర్ర మరిగించిన నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. గర్భిణులకు ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని తగ్గిస్తుంది. వామును పాలలో కల్పి వేడి చేసి తాగితే నెలసరి సమయంలో కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది. వాము నీళ్లను వేడి చేసి చల్లారాక పుక్కిలిస్తే పంటి నొప్పులు తగ్గుతాయి.