న్యూ ఇయర్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆయన హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇక జైత్ర రామ్ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.