TG: వేములవాడ భీమేశ్వరాలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేములవాడ, మేడారం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతోందని అన్నారు. కొండగట్టు, ధర్మపురి ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ మాట ఇచ్చారని గుర్తు చేశారు.