AP: వారసుడి పొలిటికల్ ఎంట్రీపై MLA గంటా శ్రీనివాసరావు స్పందించారు. తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసులకు ఛాన్స్ ఉంటుందని తెలిపారు. రాజకీయాల్లో ఎదగడం వాళ్ల కెపాసిటీని బట్టి ఉంటుందని చెప్పారు. యువత రాజకీయాల్లోకి వస్తే ప్రోత్సహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే స్థానంపై ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. ఫైనల్గా అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉంటామని వెల్లడించారు.