NZB: బోధన్ 108 అంబులెన్స్‌ను నిజామాబాద్ 108 ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, మందుల నిల్వలను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో సూపర్వైజర్ స్వరాజ్, 108 సిబ్బంది లక్ష్మణ్, జావీద్ పాల్గొన్నారు.