కడప: ఖాజీపేట(M) ములపాక గ్రామం నుంచి చెముల్ల పల్లెకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. ఇటీవల నూతన రహదారి నిర్మాణానికి పనులు చేపట్టారు. ఇందుకోసం రహదారిని జేసీబీతో తవ్వారు. అనంతరం పనుల ప్రారంభం గురించి ప్రజా ప్రతినిధులు పట్టించుకోవట్లేదు. ఈ మార్గంలో ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పనులు జరిగేలా చూడాలని కోరుతున్నారు.