SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యువతకు సూచించారు.