MBNR: వెలుగొమ్ముల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. గురువారం ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తామని దేవాదాయ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం, శనివారం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఆదివారం 4 గంటలకు రథోత్సవం ఉంటుందని అన్నారు.