BHNG: బీబీనగర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పంజాల సురేశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు గతంలో మాజీ సర్పంచ్, MPTCలను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. నూతన పాలకవర్గ సభ్యులతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.