బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన చేతిలో కేవలం రూ.20,552 నగదు మాత్రమే ఉంది. మూడు బ్యాంకు ఖాతాల్లో కలిపి సుమారు రూ.57 వేలు మాత్రమే ఉన్నాయి. అయితే, ఆయన పేరిట రూ.1.48 కోట్ల విలువైన ఒక ప్లాట్ ఉంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా డిసెంబర్ 31న తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు.