MNCL: ఉట్నూర్ నుంచి వివిధ ప్రాంతాలకు నేరుగా బస్సుల సౌకర్యం కల్పించాలని బిఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఉట్నూర్ నుంచి ప్రతిరోజు నిర్మల్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.