AP: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. రూ.4,497 కోట్ల ట్రూఅప్ ఛార్జీల నుంచి ఊరటనిచ్చింది. ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించనున్నట్లు వెల్లడించింది. 2019-24 మధ్య వినియోగించిన విద్యుత్‌పై ఉపశమనం లభించనుంది. ఇప్పటికే 2025 సెప్టెంబర్‌లో రూ.923 కోట్ల ట్రూడౌన్తో సర్కార్ రికార్డు సృష్టించింది.