AP: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుములదిన్నెలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో వేములపాటి సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.