MNCL: బెల్లంపల్లి పట్టణానికి చెందిన SC, ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ గురువారం తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని ఆ స్వామివారి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.