W.G: పెనుగొండ పేరును ఇకనుంచి వాసవి పెనుగొండగా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పేరులో మార్పు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్న నరసాపురం ఆర్డీవో దాసిరాజు, ఎంపీడీవో టి.సూర్యనారాయణ వాసవీ పెనుగొండ అని పేరుతో ఐరన్ బోర్డు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారు.