VSP: నగరం అంతటా పొగమంచు కమ్ముకుంది. విశాఖలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోవడంతో ఉదయం 10 గంటలు అయినప్పటికీ సూర్యుడు కనిపించడం లేదు. దట్టంగా పొగమంచు పడడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా కొండవాలు ప్రాంతాలలోని ఆరిలోవ, హనుమంతవాకలో పొగమంచు ఎక్కువగా ఉంది.