WGL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల సద్వినియోగ పరుచుకొని ఆర్థికంగా ఎదగాలని MLC బసవరాజు సారయ్య అన్నారు. నగరంలోని కాశీబుగ్గకు చెందిన గజ్జల త్రిభువన్ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో MLC సారయ్య ప్రత్యేక చొరవ తీసుకొని ఆయనకు సీఎం సహాయనిధి కింద రూ.5 లక్షలు మంజూరు చేయించారు. ఈ చెక్కును నేడు లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు.