E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామపంచాయతీకి కొత్త సెక్రటరీగా కారం బాల మంజరి బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం నుంచి ప్రమోషన్‌పై గ్రేడ్–3 సెక్రటరీగా ఆమెను నియమించారు. ఏడాది కాలంగా రెగ్యులర్ సెక్రటరీ లేక గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కొత్త సెక్రటరీ నియామకంతో మారుమూల గ్రామాల సమస్యలు పరిష్కారమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.