కృష్ణా: కోడూరు నూతన సంవత్సర వేడుకలకు విచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కోడూరు మండలానికి రెండు రోడ్లను నూతన సంవత్సర కానుకగా ప్రకటించారు. బుధవారం రాత్రి కోడూరులో జరిగిన కార్యక్రమంలో నరసింహపురం రోడ్డు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయానికి 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, అలాగే ఎస్టీ వాడాలోని కోత మిషన్ రోడ్డుకు సుమారు 22 లక్షల రూపాయలతో రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు.