SRPT: తుంగతుర్తి మండలం రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, వెంపటి, రావులపెల్లి గ్రామాలను సందర్శించి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. కోటిరత్నం పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడి టీకాల నిర్వహణపై తగిన సూచనలు, సలహాలు అందించారు.