KMM: జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పూర్తైనట్లు డీఎంహెచ్వో డా. రామారావు తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు 2.55 లక్షల ఇళ్లలో పరీక్షలు నిర్వహించగా 1,369 మంది అనుమానితులను గుర్తించారు. తుది పరీక్షల అనంతరం 5 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. వారికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించినట్లు పేర్కొన్నారు.