SRCL: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం ఆలుముకుంది. కొండన్నపేట గ్రామానికి చెందిన రాజేశం అనే కండక్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధులు ముగించుకొని రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.