మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో క్రేజీ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు సంపత్ నందితో ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దుల్కర్‌కు సంపత్ కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పాడట. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత 2026 మార్చిలో ఈ సినిమాపై పూర్తి నిర్ణయం తీసుకోవాలని దుల్కర్ చూస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నట్లు టాక్.