KRNL: క్రమశిక్షణ, చట్టాలపై అవగాహనతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం సూచించారు. కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 205 మంది ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి మాట్లాడారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో నైపుణ్యం అవసరమని తెలిపారు.