BDK: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, సమగ్ర అభివృద్ధి కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.