ADB: ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల చిత్రపటాన్ని ఉంచాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం, కలెక్టర్ రాజర్షి షాను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. జనవరి 3ని రాష్ట్ర ప్రభుత్వం పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందున ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటాన్ని ఉంచేలా చూడాలని విన్నవించారు.