HYD: నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా బేఖాతరు చేయడంతో, ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి నుంచి నేడు తెల్లవారుజాము వరకు ముమ్మరంగా ఈ తనిఖీలు నిర్వహించారు.