W.G: విద్యా సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని నరసాపురం ఎస్సై సీహెచ్ జయలక్ష్మి హెచ్చరించారు. నిన్న నరసాపురం పట్టణంలోని కళాశాల వద్ద చక్కర్లు కొడుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలలో నిఘాను ముమ్మరం చేసినట్లు తెలిపారు.